కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. దీని భారిన వైద్యం అందిస్తున్న డాక్టర్స్, నర్సలు , సహాయక సిబ్బంది , పోలీస్ యంత్రాంగం , పారిశుధ్య కార్మికులు , ఆర్మీ జవాన్ లు ఇలా అందరు కొరోనా భారిన పడి తమ ప్రాణాలను పణంగా పెట్టి చనిపోతున్నారు. కొరోనా రోగి తిరిగిన ప్రతి ప్రాంతాన్ని కూడా శానిటైజేషన్ చేస్తున్నారు. వీలైతే ఆ ఆఫీస్ లను మూసివేస్తున్నారు కూడా. తాజాగా దూరదర్శన్ కేంద్రం లో పనిచేస్తున్న ఉద్యోగి కరోనా తో చనిపోవడంతో ఆ టీవీ ఛానల్ లో పనిచేస్తున్న సిబ్బంది ఒక్కసారిగా షాకింగ్ కి గురి అయ్యారు. హుటా హుటిన దూరదర్శన్ ఆఫీస్ ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

 

అసలు విషయం ఏమిటంటే ఢిల్లీ డిడి న్యూస్ లో పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్ యోగేష్ కుమార్ ఒక్కసారిగా తన ఇంట్లో కుప్పకూలిపోయారు. మే 21 న యోగేష్ స్వల్ప అస్వస్థతకు గురి అవ్వగా ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీస్తుకుంటున్నారు. కరోనా లక్షణాలు లేవని జాప్యం చేయడంతో మే 27 న ఒక్క సారిగా యోగేష్ కుప్పకూలిపోయాడు అయితే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లి కరోనా టెస్టులు చేయగా అతనికి కరోనా పాజిటివ్ తేలిందని వైద్యులు తెలిపారని యోగేష్ అన్నయ్య తెలిపారు. యోగేష్ చనిపోవడంతో డిడి న్యూస్ కెమెరా డివిజన్ కు చెందిన 50 మంది ఉద్యోగులను రాంమనోహర్ లోహియా హాస్పిటల్ కి తరలించి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. అయితే డిడి న్యూస్ స్టూడియో ను మండీ హౌస్ కు తరలించి ప్రసారాలను పునరుద్ధరించనున్నారు ..నిర్వాహకులు . అయితే ప్రతి ఉద్యోగి వారానికి రెండు రోజులు విధులకు హాజరు అయ్యేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: