IHG

రోజు రోజుకి భానుడి ప్రతాపం పెరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడు వర్షాలు పడి వాతావరణం చల్లబడుతుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు . ముఖ్యంగా రైతన్నలు వర్షాల కోసం తమ భూములను సిద్ధం చేసుకుని కూర్చున్నారు. విశాఖ పట్నం వాతావరణ కేంద్రం (ఐఏండి ) రేపు కేరళకు నైరుతి రుతు పవానాలు రానున్నాయని శని వారం తెలియజేసింది. అయితే ఈ సందర్భంగా రాగాల 36 గంటలలో అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఈ ద్రోణి 48 గంటల్లో బలపడి వాయుగుండం గా మారనుంది. దీని ప్రభావంతో జూన్ 1 న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి.

 

 

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు,  కొమెరిన్‌ ప్రాంతాలలో నైరుతి రుతు పవనాలు విస్తరించనున్నాయి అని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇదిలా ఉండగా తెలుగు రాష్టాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉందని చెబుతోంది అదేవిధంగా రాయల సీమ , కర్ణాటక , కేరళ ప్రాంతాలలో కూడా ఉపరితల ఆవార్త ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఒక మోస్తరు నుండి భారీవర్షాలు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తండ్రి కూతుళ్లు పిడుగు పాటుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: