వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా... ఏం చేసినా సంచలనమే. రామ్ గోపాల్ వర్మకు కొత్తదారులను అన్విషించడం కొత్త కాదు. గతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆర్జీవీ లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ అనే సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ఆర్జీవి వరల్డ్‌.ఇన్‌' పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంటరైన ఆర్జీవీ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో నటించిన క్లైమాక్స్ సినిమాను జూన్ 6వ తేదీన ఓటీటీ వేదికపై విడుదల చేస్తున్నారు. 
 
సినిమా విడుదల సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్జీవీ సినిమా విశేషాలను వెల్లడించారు. క్లైమాక్స్ 55 నిమిషాల నిడివి ఉంటుందని... ఎడారిలోకి వెళ్లిన ఒక జంటకు ఎదురయ్యే అనుభవాలే ఈ సినిమా అని చెప్పారు. ఓటీటీ ప్యారలల్ ఇండస్ట్రీగా మారిందని... డిజిటల్‌ వేదికల వల్ల ఖర్చులు మిగులుతాయని.... కంటెంట్‌ కంటే బ్రాండ్‌ ముఖ్యం అని అన్నారు. కరోనా వల్ల ప్రపంచమంతా హారర్‌ సినిమా అయిందని... మనిషి దగ్గుతున్నా మనం భయపడుతున్నామంటే దానిని హారర్‌గానే భావించాలని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: