బిలియనీర్ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్ఎక్స్ శనివారం (మే 30) చరిత్ర సృష్టించింది.ఫ్లోరిడా నుండి కక్ష్య వైపు రెండు అమెరికన్ వ్యోమగాములను ప్రయోగించిన మొదటి ప్రైవేట్ రాకెట్ కంపెనీగా చరిత్ర సృష్టించింది. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత అమెరికన్ గడ్డపై నుండి స్పెస్ ఎక్స్ ఇద్దరు వ్యమగాములను కక్షలోకి ప్రవేశ పెట్టి చరిత్ర సృష్టించింది. వ్యోమగాములు బాబ్ బెహ్ంకెన్ మరియు డగ్ హార్లీ లు కెనెడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి సరిగ్గా మధ్యాహ్నం 3:22 గం. సమయంలో EDT (1922 GMT) ను స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లోని స్పేస్ఎక్స్ యొక్క క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో 19 గంటల ప్రయాణం చేయడానికి పూనుకున్నారు. క్రూ డ్రాగన్ దాని రెండవ దశలో బూస్టర్ నుండి 3.35 గం. వద్ద వేరు చేయబడి కక్ష్యలోకి ప్రవేశించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్లోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి హాజరయ్యారు,ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ " ఇది నమ్మశక్యం కానీ శక్తి మరియు సాంకేతికత" అని ప్రశంసించారు. అదేవిధంగా ఏది చూడడానికి అందమైన దృశ్యం గా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
నాసా నిర్వాహకుడు జిమ్ బ్రిడెన్స్టైన్ ప్రయోగం గురించి మాట్లాడుతూ " ఇది చాలా కాలం కొనసాగింది " ఇది ఒక అద్భుతమైన రోజు ,ప్రయోగం విజయవంతం కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాను. కానీ బాబ్ మరియు డౌగ్ లు సురక్షితంగా ఇంటికి తిగివచ్చిన తరువాతే సంబరాలు చేసుకుంటాము అప్పటివరకు సంబరాలు చేసుకోము అని చెప్పాడు .
అయితే వ్యోమగామి మరియు కో-కమాండర్ డవ్ హార్లీ మాట్లాడుతూ ఫాల్కన్ 9 ద్వారా మొదటి మానవ ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు మరియు ఇది నమ్మశక్యం కానీ ..అంతరిక్ష ప్రయాణానికి గొప్పగా కృషి చేసిన వారందరికీ ధన్యవాదములు " అని తెలియజేసారు
Liftoff! pic.twitter.com/DRBfdUM7JA
— SpaceX (@SpaceX) May 30, 2020