మహేష్ బాబు హీరో గా పరుశురాం దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ముందు చెప్పిన విధంగా ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది ఇటీవల ఈ సినిమా టైటిల్ సర్కారు వారి పాట అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ ని ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది. 

 

ఈ లుక్ లో మహేష్ మెడపై టాటూ కూడా ఉండటం విశేషం. ఇప్పటి వరకు మహేష్ సినిమాల్లో తొలి సారి టాటూ తో కనపడుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. నేటి నుంచి ఈ సినిమా మొదలు కానున్నా లాక్ డౌన్ లో కొన్ని షరతులు ఉండటంతో పూర్తి స్థాయి షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: