మహేష్ బాబు... నిజంగా టాలీవుడ్ లో ఇది ఒక బ్రాండ్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ గురించి కూడా అందరికి తెలిసిందే. ఇక మహేష్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట అనే చిత్రంలో పరుశురం దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని కాసేపటి క్రితం చిత్ర యూనిట్ వెల్లడించింది. 

 

ఇక ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేయడం తో అది సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది. విడుదల చేసిన గంట వ్యవధిలోనే దాదాపు 5 లక్షల మంది దానిపై ట్వీట్ చేసారు అంటే అది ఏ స్థాయిలో వైరల్ అయిందో అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: