ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలిన దేశాలతో పోలిస్తే కరోనా కట్టడిలో భారత్ మెరుగైన స్థానంలో ఉందని అన్నారు. కరోనాపై విజయం సాధించడానికి మనం మరింత శ్రమించాల్సి ఉందని చెప్పారు. క్లిష్టసమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రాణాలొడ్డి పని చేశారని చెప్పారు. కరోనా సంక్షోభంలో బాగా ఇబ్బంది పడింది వలస కూలీలే అని చెప్పారు. 
 
ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. యావత్ దేశం వలస కార్మికులకు అండగా నిలిచిందని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. కరోనా వల్ల దెబ్బ దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని... ప్రజలు ఇప్పుడు స్థానిక వస్తువులే కొంటున్నారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: