వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలో వేగవంతమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని... జగన్ సర్కార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని నియమించిందని చెప్పారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు నమ్మకం లేదని... ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కొనసాగించాలని చంద్రబాబుకు అంత ఆత్రం ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. 
 
రాష్ట్ర ప్రజలు వైసీపీని ఆదరించి అధికారంలోకి తీసుకొచ్చారని కానీ కొందరు చట్టాల్లోని లొసుగులు అడ్డం పెట్టుకుని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. వైజాగ్ వెళతానని అనుమతి తీసుకున్న చంద్రబాబు వైజాగ్ వెళ్లకుండానే హైదరాబాద్‌ వెళ్లిపోయారని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: