టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నేడు 77వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అర్ధరాత్రి నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియాలోకి వచ్చిన చిరంజీవి ట్విట్టర్ ద్వారా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కృష్ణ సాధించిన ట్రాక్ రికార్డ్ అనితర సాధ్యం అని అన్నారు. 
 
చిరంజీవి తన ట్వీట్లో "కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు, నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు, మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70ఎం.ఎం చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీతసూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు" అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: