ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా యూత్, కాలేజ్ కుర్రాళ్లు ఆ మాటలను లెక్క చేయడం లేదు. దేశంలో దాదాపు 27 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. క్యాన్సర్ భారీన పడుతున్న వారిలో మెజారిటీ శాతం పొగ తాగేవారే కావడం గమనార్హం. రోజురోజుకు పొగ తాగే వారి సంఖ్య పెరగడంతో కేంద్రం కొన్ని రోజుల క్రితం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నిబంధనలను ఉల్లంఘిన వరికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. 
 
కేంద్రం 21 ఏళ్ల పై బడిన వారు మాత్రమే స్మోకింగ్ చేయవచ్చని పేర్కొంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడం నేరం. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. పొగాకు ఉత్పత్తుదారులు ఖచ్చితంగా పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం అని ఉండేలా చూసుకోవాలి. పొగాకు ఉత్పత్తులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పబ్లిసిటీ చేయడం నిషిద్ధం. ప్రస్తుతం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగే వారికి 200 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: