కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ తరుణంలో ప్రతిఒక్కరికి  తమ జీవితాలపై ఉన్న కాస్త ఆశ కూడా చనిపోయింది అనుకుంటున్నారు అంతా. కరోనా రాకుండా జాగర్తలు పాటించడం ఎలా ? కరోనా మనకు వచ్చే అవకాశం ఉందా ? కరోనా వస్తే బ్రతి బయట పడతామా ?? వంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో దాగివున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఇన్స్పైర్ చేసే పోస్ట్ లు పెడుతూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఆనంద్ మహీంద్రా. తాజాగా అయన చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా ఉంది.

 

 

ఆ పోస్ట్ లో కేరళలోని ఇడుక్కికి చెందిన జిలుమోల్ మారియట్ థామస్ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులతో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఆసియాలో ప్రథమ మహిళ. ఆమె తన రెండు చేతులు లేకపోయినా తన సంకల్ప బలంతో మరియు పట్టుదలతో కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. అయితే ఆమె అందరికి స్ఫూర్తి నిలుస్తోంది. ఇది ఒక అద్భుతం మరియు అత్యంత స్ఫూర్తిదాయకం. ఇంకా ఇది ఆమెలో  గొప్ప సంకల్పం ని చూచిస్తుంది ,ఈ  సంకల్పం మరియు కృషికి ఆమెకు వందనం.

 

 

అయితే ఈ పోస్ట్ పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ...ఇది చూసిన తర్వాత ధైర్యం అనే పదం యొక్క అర్ధాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను ... దీనికి కోవిడ్‌తో సంబంధం లేదు, కానీ ఈ చీకటి కాలంలో, ఇది మన ముందు ఉన్న అన్ని సవాళ్లను అధిగమించగలదనే నమ్మకాన్ని ఇస్తుంది ...అంటూ ట్విట్ చేసి అందరిని ఆశ్చర్యపరచాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: