ఇప్పటి వరకు దేశంలో ఎండలతో నానా ఇబ్బందులు పడిన జనాలు ఇప్పుడు వర్షాలతో పిడుగులతో నరకం చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పిడుగు పాటు ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో పిడుగు పాటుకి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవగా పలు ప్రాంతాల్లో భారీగా వందల సంఖ్యలో పిడుగులు పడ్డాయి. 

 

దీనితో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నావ్‌ జిల్లాలో ఎనిమిది మంది, కన్నౌజ్‌ జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 13 మంది కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. ఈ స్థాయిలో పిడుగు పాటు ఘటనలు ఆ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరగలేదని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: