రాబోయే రెండు మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు తెలంగాణాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అదే విధంగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. 

 

ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియా మహా సముద్రంలో వాయిగుండం ఏర్పడింది అని అది రాబోయే రెండు రోజుల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాలు రేపు కేరళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్ తో పాటుగా మహారాష్ట్రలో కూడా అడుగుపెడతాయని వాతావరణ శాఖ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: