మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విషయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇటీవల బిజెపి నేత నారాయణ రాణే మహారాష్ట్రలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం అయింది అని కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలి డిమాండ్ చేసారు. దీనిపై స్పందించిన షా... ఆ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమని అన్నారు.

 

బీజేపీ వ్యాఖ్యలు ఎంతమాత్రమూ కావని స్పష్టం చేసారు. కరోనా కట్టడిలో ప్రతి రాష్ట్రమూ  సమర్థవంతంగా తమ తమ పాత్ర నిర్వహించాయని ఆయన అన్నారు. ఉద్దావ్ థాకరే కి అనుభవం లేదని అనగా... ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అసలు ఇష్టపడనని, ప్రతి రాష్ట్రమూ కరోనాను ఎదుర్కుంటేనే ఉందన్నారు. ఎవరో అద్భుతంగా పనిచేశారు, ఎవరు చేయలేదన్నది చెప్పడం మంచి పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: