కరోనా కట్టడి విషయంలో మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక్క కరోనా కేసును కూడా ప్రజలకు తెలియకుండా దాచే ప్రయత్నం చేయవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు కేసులు విషయంలో వాస్తవాలనే వెల్లడించాలన్న ఆయన... అందరం కలిసి సమష్టిగా కరోనాను జయిద్దామని పిలుపునిచ్చారు. 

 

కరోనా కేసుల గురించి సరైన సమాచారం ఇవ్వకపోతే ప్రజలను మరింత ప్రమాదంలోకి నెట్టినవారమవుతామని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్ ఇంతకంటే ఎక్కువగా రాష్ట్రంలో వ్యాప్తి చెందే అవకాశముందని పేర్కొన్నారు. కేసులు గురించి దాచి.. అకస్మాత్తుగా మరణాల రేటు పెరిగితే.. ప్రతి ఒక్కరు ఆందోళనకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆ పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేయలేనని ఆయన వ్యాఖ్యలు చేసారు. అక్కడ కేసులు 70 వేలకు దగ్గరగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: