భవన నిర్మాణ కార్మికులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ఇసుక సరఫరా సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వమూ చేస్తోందన్నారు. 

 

ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇసుక ధరలతో మధ్యతరగతి ప్రజలు గృహ నిర్మాణం అంటే భయపడి వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలోనూ ఇసుక లారీలు వేలాదిగా తిరిగాయన్న ఆయన... ఇసుక మాత్రం డంపింగ్ ప్రదేశాలకు చేరలేదన్నారు. ఆ ఇసుక అంతా ఎటు వెళ్లిపోయిందని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: