ఈ మధ్య సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తన భార్య పిల్లలతో కలిసి అతను చేస్తున్న టిక్ టాక్ వీడియో లు అభిమానులను ఒక రేంజ్ లో అలరిస్తున్నాయి. ఇక తన భార్యతో పాటు ఈ మధ్య తెలుగు పాటలకు డాన్స్ వేస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు పాటకు మరోసారి డాన్స్ వేసాడు వార్నర్. 

 

మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌బ్లాక్’ పాటకు భార్యతో కలిసి ఒకసారి డాన్స్ వేసిన అతను మరోసారి వేసాడు. తన భార్య క్యాండీస్‌తో కలిసి డాన్స్ వేసి పోస్ట్ చేసాడు. రెండో పార్ట్. ఇది చాలా కఠినమైంది. కానీ చేయకుంటే.. కాండీస్ నన్ను చంపేస్తుంది. మూడో పార్ట్ కావాలా?’’ అని వార్నర్ కామెంట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: