దేశ వ్యాప్తంగా వలస కార్మికులకు తరలించడానికి గానూ కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ ట్రైన్స్ ని నడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా భారీగా శ్రామిక్ ట్రైన్స్ ని కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది. దీనితో లక్షల మంది వలస కూలీలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా శ్రామిక్ ట్రైన్స్ లో సొంత ఊర్లకు వెళ్తున్నారు. 

 

తాజాగా దీనిపై రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మే 1 నుంచి 'శ్రామిక్ స్పెషల్ రైళ్లు' నడపడం మొదలుపెట్టామన్న ఆయన... అప్పటి నుండి మేము 4050 రైళ్లను నడిపామని వివరించారు. ఆ రైళ్లలో 54 లక్షలకు పైగా కార్మికులను తీసుకెళ్లారన్నారు. ఈ రైళ్లలో 80% ఉత్తరప్రదేశ్ & బీహార్ వరకు నడుస్తున్నాయని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: