లాక్ డౌన్ లో ఇప్పుడు దొంగతనాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. పనులు లేక ఖాళీ గా ఉంటున్న జనాలు ఇప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ... దొంగతనాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ దొంగతనాల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

 

ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అక్కడ దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఒక భారీ దొంగతనం జరిగింది. ఆ రాష్ట్రంలో ఎక్కువగా పండే విలువైన గసగసాలను దొంగతనం చేసారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలోని హరోలి ప్రాంతానికి చెందిన పోలీసులు రూ .45 లక్షల విలువైన గసగసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: