ఇప్పటి వరకు ఎండలతో చుక్కలు చూసిన దేశం ఇప్పుడు క్రమంగా చల్లబడుతుంది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం క్రమంగా చల్లబడటం అలాగే వర్షాలు పడటం తో అక్కడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. హర్యానా ఢిల్లీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అయితే వరదలు కూడా వస్తున్నాయి. 

 

ఇక తాజాగా హర్యానాలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. అక్కడ వాతావరణం చాలా వరకు చల్లబడింది. మొన్నటి వరకు ఎండలతో హర్యానా జనం బాగా ఇబ్బంది పడ్డారు. కాని ఇప్పుడు క్రమంగా వాతావరణం చల్లబడటం తో ఇక అక్కడ వ్యవసాయం కూడా మొదలవుతుంది. తాజాగా ఫరిదాబాద్ లో ఒక ఇంద్ర ధనుస్సు కనపడి౦ది. దీనిని అక్కడి స్థానికులు కెమెరాల్లో బంధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: