హైదరాబాద్ లో కరోనా ఆగడం లేదు. ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు కరోనా చుక్కలు చూపిస్తూనే ఉంది. అక్కడ కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. ఇక పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వస్తుంది. హైదరాబాద్ నగరంలో 9 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ రాగా... బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కి కరోనా సోకడం కంగారు పెడుతుంది.

 

ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 40 మంది పోలీసులకు కరోనా సోకింది అని అధికారులు చెప్పారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఈ కేసులు అన్నీ బయటపడటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇక పోలీసుల కుటుంబ సభ్యులు అందరిని క్వారంటైన్ చేసారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: