స్కూల్స్ విషయంలో మహారాష్ట్ర సిఎం ఉద్దావ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటిలానే జూన్‌లోనే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావాలని, ఇంటర్నెట్ సౌకర్యం లేని, కరోనా వైరస్ మహమ్మారి ప్రవేశించని మారుమూల ప్రదేశాల్లోని స్కూళ్లను సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తిరిగి తెరవాలని ఆదేశాలు ఇచ్చారు. 

 

రాష్ట్రంలో ఆన్‌లైన్ విద్యావిధానాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడే పాఠశాలలు పునఃప్రారంభించాల్సిన అవసరం లేనప్పటికీ దీర్ఘకాలంలో ఆన్‌లైన్ విద్యావిధానాన్ని అభివృద్ధి చేసి బలోపేతం చేయాలని సూచనలు చేసారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్ధుల చదువు నాశనం కావోద్దని ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రయోగాత్మక ప్రాతిపదికన ఉపయోగించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: