ఆంధ్రప్రదేశ్ లో నేడు పించన్ ల పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్  లో మొత్తం 58 లక్షల మందికి ఇప్పుడు పించన్ అందించే అవకాశాలు  ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1421 కోట్లను విడుదల చేసింది. వాలంటీర్ లు ఇంటికే వెళ్లి ఈ పించన్ ని అందించే కార్యక్రమం చేస్తారు. ఉదయం ఆరు గంటల నుంచే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలయింది. 

 

ఇక దీనిని మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిఎం జగన్ కూడా దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ లో పని చేసుకోలేని తమకు ఇది చాలా అండగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: