ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు వర్షాలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా పరిస్థితి మాత్రం పిడుగుల కారణంగా దారుణంగా మారింది అని చెప్పవచ్చు. అక్కడ పిడుగులు పడి, ఇళ్ళు కూలి 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

 

శనివారం కురిసిన భారీవర్షాలు కారణంగా పిడుగుల పాటుకు ఉన్నవ్ లో 8 మంది, కన్నౌజ్ లో ఐదుగురు మరణించారు. లక్నో నగరంలో ఓ ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు మరణించగా, బహువా ప్రాంతంలో సంభవించిన గాలులతో ఓ ఇల్లు కూలి 55 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: