రేపు ఎల్లుండు తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నేడు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయిగుండం నేడు తుఫాన్ గా మారే అవకాశం ఉందని దీని కారణంగా మహారాష్ట్ర తో పాటుగా గుజరాత్ తెలంగాణా లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది. 

 

ఇక పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. రేపు ఎల్లుండు కేరళలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: