దేశంలో కరోనా మహమ్మారి ఎలా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ఈ నేపథ్యంలో కరోనా ని అరికట్టేందుకు మార్చి నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అన్ని రాష్ట్రాలు సమ్మతం పలికాయి.. 40 రోజుల తర్వాత కొద్ది కొద్దిగా సడలింపులు మొదలయ్యాయి.  దాంతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు మల్లీ ఓపెన్ చేశారు.  ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచి మద్యం అమ్మకాలకు  వ్యతిరేంగా ఉంటూ వస్తున్నవిషయం తెలిసిందే. ఏ సమాజంలోనూ సంపూర్ణ మద్య నిషేధం అమలు కాలేదు. పైగా ఇప్పుడు మద్యపానానికి సామాజిక ఆమోదం పెరుగుతోంది. మరి, ఈ పరిస్థితుల్లో ఏపీలో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. సంపూర్థ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలులోకి తెస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు, మరో కీలక అడుగు వేసింది.

 

నేటి నుంచి మరో 535 మద్యం షాపులు కనుమరుగు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా, వాటిని 2,965కు తగ్గించింది. అయితే సంపూర్ణ మద్య నిషేదం అంటే ఒక్కసారే సాధ్యపడదని దాన్ని మెల్లి మెల్లిగా తగ్గిస్తూ.. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేలా చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.  వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 20 శాతం మేరకు షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 13 శాతం షాపులు తగ్గడంతో, ఏడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గినట్లయింది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని జగన్ చెబుతున్న సంగతి విదితమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: