తెలంగాణాలో అడవి జంతువులు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులుల హడావుడి మొదలయింది. దీనితో ఇప్పుడు ప్రజలు అందరూ కూడా భయపడుతున్నారు. హైదరాబాద్ లో నల్గొండ సహా తెలంగాణాలో మహారాష్ట్ర సరిహద్దుకి దగ్గరగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు చిరుత పులులు బయటకు వస్తున్నాయి. 

 

తాజాగా మరో చిరుత పులి కలకలం సృష్టించింది. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి సారంగపల్లి గ్రామంలో చిరుత పులి ఆనవాళ్ళు కనిపించాయి. చతులాపూర్ మీదుగా శంకర్ పల్లి ఆదిల్ పెట్ నుంచి చిరుత పులి సారంగపల్లి వైపు వెళ్లిందని అధికారులు గుర్తించారు. దీనితో స్థానికుల్లో భయం మొదలయింది. ఇప్పటికే అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. వాళ్ళు వచ్చి చిరుత పులి వచ్చినట్టు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: