డాక్టర్ సుధాకర్ విషయంలో సిబిఐ దూకుడు పెంచింది. ఆయనకు అందిస్తున్న వైద్యం నుంచి ఆయన విషయంలో ఇన్వాల్వ్ అయిన పోలీసులు ముందు నుంచి జరిగిన ఘటనలు అన్నీ కూడా ఇప్పుడు సిబిఐ విచారిస్తుంది. ఇప్పటికే ఆయన నుంచి సిబిఐ అధికారులు వాంగ్మూలం కూడా తీసుకున్నారు. దాదాపు పది గంటల పాటు ఆయనను విచారించారు. 

 

న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ సాగుతుంది. ఇక పలు కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. డా.సుధాకర్ కి వైద్యం అందించిన వైద్యులను సీబీఐ అధికారులు ప్రశ్నించారని కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ మీడియాకు తెలిపారు. కాగా ఈ కేసులో నివేదికను సిబిఐ 8 వారాల్లో ఇవ్వాలని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: