ఏపీ సచివాలయంలో ఓ ఉద్యోగికి కరోనా వచ్చిన తర్వాత... ఇంకా ఎంత మందికి కరోనా వచ్చి ఉంటుందో అనే టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ నుంచి కొంత మంది సచివాలయం ఉద్యోగులు ప్రత్యేక బస్సులలో అమరావతి చేరుకున్నారు. అమరావతి చేరుకున్న తర్వాత అందరికీ కరోనా పరీక్షలు చేశారు. ఐతే  అందులో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  దీంతో ఒక్కసారిగా అమరావతి సెక్రటేరియట్ లో కలకలం రేగింది. దీంతో ఉద్యోగులంతా భయాందోళనకు  గురవుతున్నారు.

 

ఈ నేపథ్యంలో సచివాలయంపై కరోనా ప్రభావం పడింది. సచివాలయంలోని 3,4 బ్లాకుల్లో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో, సచివాలయం మొత్తం రసాయన ద్రావణాలతో శానిటైజ్ చేస్తున్నారు. 3,4 బ్లాకుల్లోకి ప్రవేశం నిషేధించారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఉద్యోగితో గత రెండు రోజులుగా ఉన్న ఉద్యోగులు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని సచివాలయ ఉద్యోగ సంఘం విజ్ఞప్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: