గత కొద్ది రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లో రెచ్చిపోతున్నారు.  జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా వరుస కాల్పులకు పాల్పపడుతున్నారు.  గత ఏడాది పుల్వామాలో చేసిన దారుణం భారత్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉందన్న విషయం తెలిసిందే. అయితే దానికి ధీటుగా భారత్ సైన్యం ఉగ్ర స్థావరాలపై బీభత్సమైన దాడి చేసి సరైన బుద్ది కూడా చెప్పారు.  అయితే కొంత కాలంగా  భారత్‌లో అలజడి సృష్టించే పన్నాగం వేస్తూ.. పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఉగ్రవాదులను చొప్పించేందుకు ప్రయత్నించింది. మొన్న మరోసారి పుల్వామా తరహా దాడికి ప్రయత్నించగా వారి పన్నాగాన్ని తిప్పకొట్టారు భారత్ సైనికులు.   

 

సోమవారం ఉదయం ఆర్మీ జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. నౌషేరా సెక్టార్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఘటనతో నిఘా మరింత కట్టుదిట్టం చేసి ఎవరైనా ముష్కరులు ఉన్నారేమోనని గాలింపు మొదలుపెట్టారు.  భాతర సైన్యానికి కనిపించకుండా వారి కన్నుగప్పి గుట్టుగా భారత భూభాగంలోకి వచ్చి అలజడి సృష్టించేందుకు సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు వచ్చారు. వీరు నియంత్రణ రేఖ దాటే సమయంలో కాల్పులు జరిపారు.  

 

వారిని ఏరివేసేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. వీరంతా  పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన పొందినట్టుగా అనుమానిస్తున్నారు. మరోవైపు ఆక్రమిత కశ్మీర్‌లో పెద్ద ఎత్తున జైషే మహ్మద్ ఉగ్రవాదులు మన భూభాగంలోకి అడుగుపెట్టేందుకు  వేచిచూస్తున్నారని  ఐబీ వర్గాలు అప్రమత్తం చేశాయి. ఇక మే 28 నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా వేసవి కావడంతో చొరబాట్లు పెరిగాయని, వీటిని ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతుందని అధికారులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: