కేంద్ర కేబినేట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు గానూ తాము కీలక నిర్ణయాలను తీసుకున్నామని, పేద ప్రజల సంక్షేమమే తమ సంక్షేమం అని ప్రకాష్ జవదేకర్ మీడియా తో అన్నారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పథకం తీసుకొచ్చామని చెప్పారు. ఎంఎస్ఎంఈ ల కోసం 50 వేల కోట్ల ఈక్విటి పెట్టుబడులు పెడుతున్నామని కేంద్ర మంత్రులు చెప్పారు. 

 

రైతులను మరింతగా ఆదుకుంటామని చెప్పారు. తమ నిర్ణయాలతో 50 వేల మంది వీధి వ్యాపారులు కష్టాల నుంచి బయటపడతారని కేంద్ర మంత్రులు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆరు కోట్ల మంది ఎంఎస్ఎంఈ లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: