తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ మరింత తీవ్రమైంది. ఇవాళ ఒక్కరోజే 199 కొత్త కేసులు వెల్లడయ్యాయి. స్థానికంగా 196 మందికి కరోనా నిర్ధారణ కాగా, బయటి నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా సోకినట్టు తేలింది.  ఏకంగా 122 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 40 పాజిటివ్ కేసులు తేలాయి. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు చూడని జిల్లాల్లోనూ ఈసారి కేసులు రావడం తెలంగాణ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు పెరిగిపోవండంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో జాగ్రత్త చర్యలను తీసుకుంటుందని అయినా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆమె అన్నారు.

 

ఒకే ఒక్క రోజు రికార్డు స్ధాయిలో రాష్ట్రంలో 199 కేసులు నమోదయ్యాయన్న వారిలో ఇద్దరు మెడికోలు కూడా ఉన్నారని గవర్నర్ తెలిపారు. ఒకే ఒక్క రోజు రికార్డు స్ధాయిలో రాష్ట్రంలో 199 కేసులు నమోదయ్యాయన్న వారిలో ఇద్దరు మెడికోలు కూడా ఉన్నారని గవర్నర్ తెలిపారు.  ప్రజలకు ఇది ఒక హెచ్చరిక అని, కరోనాను తరిమేయడానికి అందరం కలిసి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మనమంతా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించారంటే దాని అర్థం జాగ్రత్త చర్యల విషయంలో సడలింపు ఇచ్చినట్లు కాదని గవర్నర్ తెలిపారు. లాక్‌డౌన్ 5 రిలాక్సేషన్ వైరస్‌కు కాదు విలువలకు అని గవర్నర్ తెలిపారు. మనం అన్‌లాక్ 1 దిశగా ప్రయాణం చేస్తున్నామని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: