వన్డే టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ రాజకీయాలను తట్టుకుని నిలబడాలి అని పాకిస్తాన్ మాజీ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పాకిస్థాన్ క్రికెట్‌లో ఉన్న రాజకీయాలను తట్టుకోవాలని అతనికి క్రికెట్‌పై మంచి పట్టు ఉందని... కానీ, పాకిస్థాన్ క్రికెట్‌లో చాలా రాజకీయాలు జరుగుతాయని చెప్పారు. 

 

ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తుందని... స్టార్ బ్యాట్స్‌మెన్‌ అయినా.. ఒకసారి ఓడిపోవడం మొదలైతే.. వచ్చే ఒత్తిడి బ్యాటింగ్ స్కిల్స్‌‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఎంతో మంచి గొప్ప ఆటగాళ్లకు కెప్టెన్సీ కారణంగా ఎంతో ఒత్తిడి ఎదురుకున్నారని గుర్తు చేసారు. కానీ, దాన్ని అధిగమిస్తేనే.. గొప్ప కెప్టెన్ అవుతారన్నారు. బాబర్ ఆ ఒత్తిడిని అధిగమిస్తాడని భావిస్తున్న అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: