యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. బాల‌య్య బ‌య‌ట మీడియాకు పెద్ద‌గా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌రు. అయితే ఆయ‌న తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ క్ర‌మంలోనే త‌న యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బాల‌య్య బ‌దులు ఇస్తూ తాను ప్ర‌తి రోజు ఉద‌యం 3 గంట‌ల‌కే నిద్ర లేస్తాన‌ని.. ఒక్కోసారి తెల్ల‌వారు ఝామున 2 గంట‌ల‌కే నిద్ర‌లేస్తాన‌ని చెప్పారు.

 

ఆ టైం నుంచి తాను పూజ చేసుకుంటాన‌ని.. పూజ అంటే తాను కేవ‌లం పండ‌గ‌ల‌కు మాత్ర‌మే పూజా గ‌దిలోకి వెళ‌తాన‌ని... అయితే ప్ర‌తి రోజు చేసే పూజ మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంద‌ని.. త‌న గ‌దిలో ఈశాన్య‌న ఉండే రాక్లో అగ‌ర‌వ‌త్తులు వెలిగించి పుస్త‌కాలు చ‌దువుకుంటాన‌ని చెప్పారు. అయితే ఈ పూజ మొత్తం 2 గంట‌ల నుంచి 2.45 గంటల పాటు కూడా ఉంటుంద‌ని చెప్పారు. ఏదేమైనా బాల‌య్య పూజా చాలా వైరైటీగా ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: