మత్స్యాకారులు వేటకు వెళ్లారు.. తమ వలలో ఏదో బరువైన ప్రాణి పడిందని భావించి ఇక తమ కరువు తీరిందని భావించారు.  పెద్ద చేప వలలో పడింది ఇక పండుగే అని అనుకున్నారు. ఒడిశా రాష్ట్రం మ‌యూర్‌భంజ్ జిల్లాకు చెందిన కొంద‌రు మ‌త్స్య‌కారులు సోమ‌వారం జంభీరా డ్యామ్‌లో చేప‌ల కోసం వ‌లవేశారు. ఆ వ‌ల‌ను లాగుతుండ‌గా బ‌రువుగా రావ‌డాన్ని గుర్తించిన మ‌త్స్య‌కారులు భారీ మ‌త్స్యరాజ‌మే చిక్కింద‌ని భావించారు.  వెంటనే దాన్ని లాగారు.. తీరా చూసి షాక్ తిన్నారు. చేప‌కు బ‌దులుగా భారీ తాబేలు క‌నిపించింది.   దీంతో మ‌త్స్యకారులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. 

 

 

మ‌త్స్య‌కారులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు డివిజ‌న‌ల్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ స్వ‌యం మాలిక్ సిబ్బంధితో క‌లిసి జంభీరా డ్యామ్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. మ‌త్స్య‌కారుల వ‌ల‌లో చిక్కిన ఆ తాబేలు ట్ర‌యోనిఖిడే జాతికి చెందిన అరుదైన తాబేలుగా గుర్తించారు.   అనంత‌రం మ‌త్స్య‌కారుల సాయంతో ఆ తాబేలును తిరిగి అదే డ్యామ్‌లో విడిచిపెట్టారు. అయితే ఇలాంటి తాబేళ్లు  ట్ర‌యోనిఖిడే జాతికి చెందిన ఈ అరుదైన తాబేళ్లు ఎక్కువ‌గా ఆఫ్రికా, ఆసియా, నార్త్ అమెరికా దేశాల్లో క‌నిపిస్తాయ‌ని, ఇవి 30 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయ‌ని, ఈ తాబేళ్ల జీవితకాలం గ‌రిష్టంగా 50 ఏండ్లు ఉంటుంద‌ని స్వ‌యం మాలిక్ తెలిపారు.       ‌

మరింత సమాచారం తెలుసుకోండి: