ఇప్పుడు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు పడుతున్న నరకం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా మంది తినడానికి తిండి లేక కూడా అవస్థలు పడే పరిస్థితి ఇతర దేశాలలో ఉంది అనేది వాస్తవం. సింగపూర్ అమెరికా ఇలా చాలా దేశాల్లో ఉన్న భారతీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే... 

 

ఒంటరిగా ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావడానికి గానూ సింగపూర్ తెలుగు సమాజం వచ్చే వారం సింగపూర్ నుండి హైదరాబాద్ వచ్చేందుకు గానూ ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ప్లాన్ చేస్తున్నారని... ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. మీరు / మీ కుటుంబం ఈ విమానంలో ప్రయాణించాలనుకుంటే, దయచేసి మీ పూర్తి పేరు / సంఖ్యను వెంటనే, singhydplane@gmail.com కు పంపండని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: