IHG

లాక్ డౌన్ వల్ల మనుషుల మధ్య సంబంధ భాంధవ్యాలు దగ్గరవుతున్నాయనే చెప్పాలి. ఇండస్ట్రీ, సినీ , రాజకీయ ఇలా అన్ని రంగాల వారు లాక్ డౌన్ లో తమ ఫామిలీ మెంబర్స్ తో ఎంచక్కా కబురులు చెబుతూ హ్యాపీగా గడుపుతున్నారు. బిజీ స్కెడ్యూల్ మధ్య కాలం  గడిపే సినిమా స్టార్లు లాక్ డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో ఎంచక్కా గడుపుతున్నారు. టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ లాక్ డౌన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రేర్ గా తప్ప కుటుంబం తో కనిపించని మాస్ మహారాజ తాజాగా సోషల్ మీడియా లో తన ఫామిలీ కి సంబందించిన ఫోటో లను షేర్ చేస్తున్నాడు.

 

IHG

తన కూతురు మోక్షద భూపతిరాజా మరియు కొడుకు మహాదన్ ల ఫోటో లను సోషల్ మీడియా లో షేర్ చేసి అందరిని షాక్ కి గురిచేశాడు. అయితే తాజాగా తన కొడుకు మహాధన్  చిన్నప్పటి ఫోటో ను షేర్ చేసి అందరిని ఖుషి చేశాడు. గతం లో ఎన్నడూ తన ఫ్యామిలీని మీడియా ముందుకు తీసుకురాని రవి తేజ ఒక్కసారిగా తన ఫ్యామిలీ కి సంబందించిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో పంచుకున్నందుకు అభిమానులు తెగసంబర పడి పోతున్నారు ..ఆ ఫోటో ని చూసి తండ్రి కొడుకుల గొప్ప అనుభందం అని కామెంట్స్ తో రీ-ట్వీట్ చేస్తున్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: