కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ మొదలు పెట్టాయి. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా విద్య సంస్థలు అన్ని కూడా మూత పడ్డాయి. ఇండియా లో లాక్ డౌన్ ల మీద లాక్ డౌన్ విధించిన తరువాత కొన్ని లాక్ డౌన్ నిభందనలు సడలింపులతో విద్య సంస్థలకు అనుమతి లభించింది. అయితే ఈ సందర్భంగా 11 , 12 వ తరగతుల పరీక్షలను నిర్వహించడానికి విద్య సంస్థలు ముందుకొచ్చాయి. అయితే కొన్ని ప్రాంతాలలో వాహన సదుపాయాలు ఉన్నాయ్ కానీ వాహన మరియు కొన్ని ప్రాంతాలలో రవాణా సౌకర్యం లేక పోవడం తో విద్యార్థులు ఇబ్బందులకు గురిఅవుతున్నారు. కానీ కేరళ ప్రభుత్వం మటుకు వారికోసం సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి ఉదాహరణ కేరళ లోని ఓ విద్యార్థి కోసం  KSWTD 70 సీట్ల పడవను ఏర్పాటు చేయడమే.

 అవును ..ఇది నిజం KSWTD 70 సీట్ల పడవను కేవలం ఒకే ఒక  విద్యార్ధి కోసం ఏర్పాటు చేశారు. సాండ్రా అనే విద్యార్థి కొట్టాయం జిల్లాలోని కంజీరామ్‌లోని ఎస్‌ఎన్‌డిపి హయ్యర్ సెకండరీ స్కూల్లో 11 వ తరగతి చదువుతూ వుంది. అయితే లాక్ డౌన్ సడలించిన తరువాత పరీక్షలను పునరుద్ధరిస్తున్నట్లు బోర్డు తెలిపింది. అయితే అక్కడ అన్ని ఏరియాలకు బోటింగ్ సదుపాయం లభించింది. అయితే సాండ్రా నివసిస్తున్న ప్రాంతానికి బోట్ సర్వీస్ లు ఆపివేయబడ్డాయి. దింతో ఈ విషయాన్నీ ఓ విలేకరి బోర్డు దృష్టికి తెలియజేయడంతో వారు స్పందించి ఆమెకు బోట్ ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆమెను పరీక్షా సెంటర్ వరకు దిగబెట్టి ఆమె పరీక్ష అనంతరం ఆమెను తన ఇంటికి చేరుస్తు ఆమెకు సహాయం చేస్తున్నారు. ఇలా అన్ని రాష్ట్రాలలో అమలు జరిగితే విద్య వ్యవస్థ చాల పురోగతిని సాధిస్తుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: