ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించడంలో భాగంగా జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో మ‌ద్యం షాపులు భారీ సంఖ్య‌లో త‌గ్గాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపులను తగ్గించాలన్న ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి మరో 13 శాతం మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఏడాదిలోనే ప్రభు త్వం 33 శాతం మద్యం షాపులను తగ్గించడం గ‌మ‌నార్హం.

 

అయితే.. గ‌త‌ టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం షాపులు ఇపుడు 2,934కు తగ్గిపోయాయి. దీంతో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌  ఏడాది కాలంలోనే 1,446 షాపుల‌ను తగ్గించారు. ఇందులో ప్ర‌ధానంగా మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగే షాపులను, అద్దెలు ఎక్కువగా ఉన్న షాపులను ప్రభుత్వం మూసివేయడం గమనార్హం. జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంపై ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: