ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారికి ఔష‌ధాన్ని క‌నిపెట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. శాస్త్ర‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. అయితే.. ప‌లు ప్ర‌యోగాలు సానుకూల ఫ‌లితాల‌ను ఇస్తున్నాయి. తాజాగా.. ర‌ష్యాలో కూడా క‌రోనా వైర‌స్‌కు విరుడుగా ఔష‌ధాన్ని వినియోగించ‌నున్నారు. దీనిని అక్క‌డి ప్ర‌భుత్వం కూడా ఆమోదించింది. వ‌చ్చే వారం నుంచే దీనిని క‌రోనా రోగుల చికిత్సలో వినియోగించ‌నున్నారు. ఈ ఔష‌ధం ప‌నిచేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని ఆ దేశ ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

ఇదిలా ఉండ‌గా.. ర‌ష్యాలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర‌స్థాయిలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 4,14,878 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, 4,855 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ప్ర‌పంచంలో అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్న దేశాల్లో ర‌ష్యా మూడో స్థానంలో ఉంది. మొద‌టి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: