జలదీక్షకు సిద్దమవుతున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ కీలక నేతలతో పాటుగా యువనేతలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా ఉత్తమ కుమార్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి అదే విధంగా మరి కొందరు యువ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

 

కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. జలదీక్షకు ముందు అనుమతులు ఇచ్చి ఆ తర్వాత ఎందుకు వద్దు అని అరెస్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు జిల్లాల అధ్యక్షులను కూడా పోలీసులు అదుపు చేస్తున్నారు. అటు కార్యకర్తలను కూడా బయటకు రానీయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: