తెలంగాణా ఆవిర్భావ వేడుకులను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం హడావుడి లేకుండా నిర్వహిస్తుంది. కరోనా నేపధ్యంలో ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూనే వేడుకలను చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నేడు ఏడో వసంతంలోకి అడుగుపెట్టగా... ఉదయం 8:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించి ఆ తర్వాత ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 

 

అలాగే తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో సీఎస్ సోమేశ్ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇక తెరాస కీలక నేతలు సహా పలువురు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. శాసన సభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అందరూ కూడా పాల్గొన్నారు. గాంధీ భవన్ లో పీసీసీ ఛీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి  జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: