ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సరిగా ఆరేళ్లు పూర్తయ్యాయి.. యావత్ తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్నారు.. కానీ కండీషన్లు అప్లై అంటున్నారు.  గుంపులుగా కాకుండా సామజిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సరిగా ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎటు వైపు పయనించింది? అభివృద్ధి తీరు ఎలా ఉంది? స్వరాష్ట్ర పాలనలో విస్మరించినవి ఏంటి? అని ఆరా తీస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులతో కళకళ లాడుతోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు రాష్ట్రానికి వెన్నెముకలా మారాయి.

 

తెలంగాణ రావడానికి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి శుభాకాంక్షల వెల్లువలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు.  ఎంతో మంది యువతకు గొప్ప ఆదర్శనాయకులు కేసీఆర్ అన్నారు.  'ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసిన జన హృదయ నేత శ్రీ కేసీఆర్ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు' అని చిరంజీవి పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: