తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోమాలియా అయ్యేదని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మంత్రి జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. గాలి, నీరు, భూమి ఉన్నన్ని రోజులు కేసీఆర్ పేరు ఉంటుందని ఆయన స్పష్ట౦ చేసారు. 

 

కేసీఆర్ తెలంగాణ ఆస్తి  అన్న మంత్రి... ఆయన ఓ సింహం అని కొనియాడారు. ఆరేళ్లలో అద్భుతమైన ఫలితాలు అందించారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆరే దైవమని మంత్రి గంగుల వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా బిజెపి ఎంపీ బండి సంజయ్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: