దేశంలో కరోనా మహమ్మారి పెరిగిపోతూనే ఉంది. కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని రీతిలో భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8,171  మందికి కొత్తగా కరోనా సోకగా, 204 మంది మరణించారు. 

 

దేశంలో మహారాష్ట్రలో అధిక కేసులు నమోదు అవుతుండగా.. ఢిల్లీ, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, తమిళనాడులో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది.  అయితే లాక్‌ డౌన్‌ సడలింపుల వల్లే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు.  ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,98,706 కి చేరగా, మృతుల సంఖ్య 5,598 కి చేరుకుంది. 97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,526 మంది కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: