దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసింది. ఆర్థిక ప్యాకేజీ ప్రకటన అనంతరం ప్రధాని తొలిసారిగా ప్రసంగించారు. సీఐఐ 125 వార్షికోత్సవ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాల దృష్టితోనే ఆత్మ నిర్భర ప్యాకేజీ రూపొందించామన్నారు. లాక్ డౌన్ అన్ లాక్ మొదటి దశ ప్రారంభమైందన్నారు మోదీ. మరో వారంలో రెండో దశ కూడా ప్రారంభమవుతుందన్నారు. లాక్ డౌన్‌ విషయంలో మనం ఎలా పనిచేశామన్న విషయమో అందరికీ తెలిసిందేన్నారు. కరోనాకు వ్యతిరేకంగా మనం భారత ఆర్థికవ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఇది మన ప్రాధాన్యతల్లో ప్రధానమైనదన్నారు మోదీ. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

 

భారత పరిశ్రమ సమాఖ్య (సీఐఐ) 122వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలో తాము కరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇలా పరిస్థితుల్లో ఐదు 'ఐ'లపై దృష్టి సారించామని తెలిపారు. ఇంటెంట్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్‌లపై దృష్టి పెట్టామని వివరించారు. విష్కతర సమయంలో తాము ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రపంచానికి ఎగుమతి చేసేందుకు మేడిన్‌ ఇండియాకు ప్రోత్సాహమిస్తున్నామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: