సింగరేణిలో భారీ పేలుడు సంభవించింది. పెద్దపల్లి ఓపెన్ కాస్ట్ 1 ఫేజ్ 2 లో భారీ పేలుడు  జరిగింది. ఫేజ్ లో బ్లాస్టింగ్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. 

 

గాయాలు అయిన ఇద్దరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వం ఆరా తీసింది. ఇంకా ఎవరైనా గాయపడ్డారా అనేది తెలియాల్సి ఉంది. బ్లాస్టింగ్ జరిగే సమయంలో ఎం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని పెద్దపల్లి స్థానిక ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: