ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంది.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మరణాలు సంబవించాయో అందులో మూడో వంతు అమెరికాలోనే జరిగాయి. ముఖ్యంగా న్యూయార్క్ లో మరణ మృదంగం వాయిస్తుంది కరోనా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆఫిక్రన్‌ అమెరికన్‌పై జరిగిన దాడికి నిరసనగా అమెరికాలో పెద్ద వ్యాప్తంగా రగడ మొదలైయ్యింది.  నల్లజాతీయులపై అమెరికా దాష్టికం పై పెద్ద సంఖ్యలో నిరసన కారులు గొడవ చేస్తున్నారు. తాజాగా ఆఫిక్రన్‌ అమెరికన్‌పై జరిగిన దాడికి నిరసనగా అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల స్పందించారు.

 

“ సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదు. ఇతరుల భావాలను అర్థం చేసుకుని గౌరవించడం, పరస్పర అవగాహన కలిగి ఉండటంపై చాలా చేయాల్సి ఉంది. నేను నల్లజాతి వారు, ఆఫ్రికన్‌ కమ్యూనిటీకి సపోర్ట్‌గా ఉంటాను. కంపెనీలోని ఆఫ్రికన్‌ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతాం” అని సత్యనాదెండ్ల ట్వీట్‌ చేశారు.  న్యాయం కోసం పోరాడుతున్న వారికి మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: