నిమ్మగడ్డ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా లాయర్ నర్రా శ్రీనివాసరావు సుప్రీంలో కేవియట్ దాఖలు చేయగా తాజాగా మరో కేవియట్ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి మార్పు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి జగన్ సర్కార్ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో స్టే ఇవ్వాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించకుంది. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు తీర్పు అమలు గురించి సుప్రీంను ఆశ్రయించినట్టు ధర్మాసనానికి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: