ఏపీ రాజ‌కీయం మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా వేడెక్కింది. సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు.. ఇటు హైకోర్టులో నిమ్మ‌గ‌డ్డ‌పై వేసిన ఫిటిష‌న్ ఏపీ ప్ర‌భుత్వం ఉప సంహ‌రించుకోవ‌డంతో ప‌రిణామాలు ఆస‌క్తిగా మారాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయిన వెంట‌నే సీఎం జగన్‌తో మంత్రులు, విజయసాయి కీలక భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని జ‌గ‌న్‌తో తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీక్రెట్‌గా భేటీ అయ్యారు.

 

సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దవ్వగానే మంత్రులు ఆయన్ను కలవడం... సీక్రెట్ చాలా సేపు కొన‌సాగ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.  ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారంపై కూడా కీలక చర్చ కు వ‌చ్చాయ‌ని స‌మాచారం. ఈ భేటీతో స‌చివాల‌యంలో ఒక్క‌సారిగా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: